జమిలికి సై అన్న వైసీపీ

జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు లా కమిషన్‌కు ఈ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఢిల్లీలో లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజయసాయి.. ఈ తరహా విధానంతో ఎన్నికల  ఖర్చు, అవినీతి తగ్గుతుందని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏమిటని తాము కమిషన్‌ను అడిగామని..ఏ ప్రభుత్వమైనా కూలిపోతే..మిగతా కాలానికే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. కాగా..రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి బీజేపీ, మిత్ర పక్షాలు అభ్యర్థిని నిలబెడితే మాత్రం తాము మద్దతునివ్వబోమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందున బీజేపీ అభ్యర్థిని  సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అన్నారు. జమిలి ఎన్నికలకు తెరాస సహా ఇప్పటికే నాలుగు పార్టీలు మద్దతు ప్రకటించగా.. తొమ్మిది పార్టీలు వ్యతిరేకించిన విషయం గమనార్హం.

Related News