‘నాలుగేళ్లుగా చంద్రబాబు చూపించింది ఆ రెండు షోలే..!’

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రెండు సినిమాలు చూపిస్తున్నారన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అందులో ఒకటి రాజధాని అమరావతి కాగా, మరొకటి పోలవరం అని చెప్పుకొచ్చారు.


అదిగో సింగపూర్‌.. అదిగో జపాన్‌.. ఇదిగో రాజధాని అమరావతి అంటారని ఎద్దేవా చేశారు. కాస్త కలెక్షన్లు ఎక్కువ రావడానికి ప్రతి సోమవారం పోలవారం అంటూ అక్కడకు వెళుతున్నారని ఆరోపించారు.


పోలవరం సినిమా ఎలా ఉందంటే.. మొన్న పునాది గోడలను జాతికి అంకితం అన్నారని, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అంటూ ఎన్నో అబద్దాలు చెప్పుకున్నారు. ఇది.. ఒక ఇల్లు కట్టడానికి ఆరుసార్లు శంకుస్థాపన చేసినట్లుగా ఉంది.. అంటూ జగన్ ఎద్దేవా చేశారు.


ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరం, కోటపల్లి శ్యామలా థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన జగన్ చంద్రబాబుపై సెటైర్లకు ప్రాధాన్యతనిచ్చారు.

Related News