రండి.. ఇలా చేద్దాం.. వర్కౌటైపోద్ది

ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు కొత్తది.. వినూత్నమైనది.. సులువైనది అయిన ఒక ఫార్ములాను బయటపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, ఆ ఫార్ములాను ఆచరిద్దాం రమ్మంటూ అధికార తెలుగుదేశం పార్టీని పిలిచారు కూడా. ఇంతకీ జగన్ ఫార్ములా ఏంటంటే.. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ రాజీనామాలు చేశారు.. ఇక మీరు (టీడీపీ) ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే. మొత్తం 25 మంది కలిసి నిరాహార దీక్షకు దిగితే బ్రహ్మాండం బద్దలైపోతుందన్నారు. అప్పుడు కేంద్రం దిగివస్తుందని, దేశం మొత్తం మనవైపు చూస్తుందని.. దీనిని యుద్ధమంటారని, యుద్ధమంటే ఇలా చేయండనేందుకు ఇది ఒక రోల్ మోడల్ లా ప్రసిద్ధి చెందుతుందని జగన్ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లో  అవిశ్వాస తీర్మానంలో జరిగిన పరిస్థితిని చూశామని.. ఇప్పుడు ఈ తరహా ఫైట్ చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా దాసోహమంటుందన్న రేంజ్ లో జగన్ టీడీపీకి కొత్త ప్రపోజల్ ఇచ్చారు. దీనికి టీడీపీ ఓకే చెబుతుందో.. ఒక వేళ అదే జరిగితే ఏపీకి ప్రత్యేక హోదా ఎంత వీజీగా వస్తుందో చూడాలి.

Related News