వైఎస్ బయోపిక్.. సబితగా సుహాసిని!

వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ ఎంతవరకు వచ్చింది? ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు కొన్ని పాత్రలకు సంబందించిన నటీనటులను ఎంపికలో నిమగ్నమయ్యాడు డైరెక్టర్ మహి వి రాఘవ. అప్పటి వైఎస్ సర్కార్‌లో ఓ వెలుగు వెలిగారు సబితా ఇంద్రారెడ్డి. ఆమె పాత్రలో సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. సబితా పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతారని భావించి సుహాసినిని యూనిట్ సంప్రదించడం, దాదాపుగా ఓకే చెప్పినట్టు ఇన్‌సైడ్ సమాచారం.

విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రిత కాగా, వైఎస్ అసిస్టెంట్‌గా సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళిని ఎంచుకున్నారు. షర్మిళ పాత్ర కోసం భూమికని ఎంపిక చేసినట్టు వార్తలు రాగా, ఆమెకి సంబంధించిన సీన్స్ లేవని చెప్పేశాడు డైరెక్టర్. వైఎస్‌గా ముమ్మట్టి కనిపించనున్నాడు. ‘ఆనందోబ్రహ్మ’ ఫేమ్ మహీ రాఘవ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు.

Related News