నల్గొండ జిల్లాలో దారుణం, పట్టపగలే పరువు హత్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఆసుపత్రి వద్ద పట్టపగలే దారుణ హత్య జరిగింది. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళు ప్రణయ్ అనే యువకుడిపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయగా..ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు మిర్యాలగూడకే చెందిన ఓ ప్రముఖ బిల్డర్ కుమార్తె అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆమె గర్భం దాల్చడంతో ఈ ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ..వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి అతనిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడని తెలిసింది. ఇది ముమ్మాటికీ పరువు హత్యగా చెబుతున్నారు.

ఈ కిరాతకానికి పాల్పడిన యువతి తండ్రి, బాబాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మారుతీరావు, శ్రవణ్‌‌కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా మిర్యాలగూడలో శనివారం బంద్‌కు పిలుపునిచ్చాయి ఎస్సీ సంఘాలు.

Related News