సూసైడ్ లైవ్ స్ట్రీమింగ్, మూవీ చూసినట్టుగా…

పక్కన ఏమి జరిగితే నాకెందుకు అనుకునే రోజులివి. తాను చనిపోతున్నానని ఆ యువకుడు చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ పెట్టాడు. దాన్ని సినిమా చూసినట్టు చూశారుగానీ, ఓ ఒక్కరూ పోలీసులకు ఫోన్‌ చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ యువకుడికి వచ్చిన కష్టాలేంటి? ఇంకా లోతుగా వెళ్తే..

24 ఏళ్ల యువకుడి పేరు మున్నాకుమార్. ఆగ్రాలోని శాంతినగర్ ప్రాంతానికి చెందినవాడు. బీఎస్సీ ఫినిష్ చేసి జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతగాడికి ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఈ క్రమంలో అందులోకి వెళ్లేందుకు ఐదుసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. దీంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం సూసైడ్ చేసుకునేందుకు మున్నా ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ పెట్టాడు. దాన్ని 2,750 మంది చూశారు. ఆ సమయంలో ఏ ఒక్కరూ ఇటు పోలీసులకుగానీ, అటు యువకుడి ఫ్యామిలీసభ్యులకుగానీ కనీసం సమాచారం చేరవేసే ప్రయత్నం చేయలేదు. చివరకు చనిపోయాడు. తాను ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నానో క్లియర్‌గా ఆరు పేజీల నోట్‌ రాశాడు. ఆర్మీకి ఎంపిక కానందుకు తనను తాను నిందించుకున్నానని, ఈ విషయంలో తన పేరెంట్స్‌ని నిరాశపరిచాను అని రాసుకొచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మున్నా కోసం తాము కిరాణా షాపు పెట్టానని మృతుడి తండ్రి చెబుతున్నాడు.

READ ALSO

Related News