స్పీడ్ పెంచేసిన యామి

బాలీవుడ్ బ్యూటీ యామిగౌతమ్ రూటు మార్చింది. నార్మల్‌గా వుంటే గ్లామర్ ఫీల్డ్‌లో రాణించడం కష్టమని భావించింది ఈ అమ్మడు. ఏకంగా పోలో డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుని వెండితెరపై రచ్చ చేయాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. బుల్లితెర మొదలు వెండితెర వరకు యామి గురించి చాలామందికి తెలుసు. కానీ అవేమీ ఆమెకి ఆఫర్స్‌ని తీసుకురాలేకపోయాయి.

ప్రస్తుతం గ్లామర్ ఇండస్ర్టీలో ట్రెండ్ మారింది. ఈమె కంటే వెనుకొచ్చిన బ్యూటీలు దూసుకుపోతున్నారు.. దీనికితోడు కాసింత హాట్‌గా కనిపిస్తేనే ఆఫర్స్, లేకుంటే గ్లామర్ ఫీల్మ్ కష్టమనే ఫార్ములాని బాగానే వంట బట్టించుకుంది యామి. ఏడాదికి ఒకటీ లేదా రెండు సినిమాలతో మాత్రమే సరిపెట్టుకుంటోంది. ఇప్పుడిప్పుడే కాస్త రూటు మార్చి ఆ దిశగా అడుగు లేస్తోంది. మొన్నటికిమొన్న ఓ మేగజైన్‌కి స్పైసీగా పోజులిచ్చిన యామి, ఈసారి పోలో డ్యాన్స్‌లో కాసింత హాట్‌గానే కనిపించడం కొసమెరుపు. మొత్తానికి ఫిట్‌నెస్‌పై తనకున్న ఇంట్రెస్ట్‌ని ఈ పోలోడ్యాన్స్ ద్వారా ప్రూవ్‌ చేసుకుంటోంది ఈ బ్యూటీ.

Related News