భర్త అత్యాచారం, భార్య ఆత్మహత్యాయత్నం!

ఓవర్ రొమాన్స్‌ కోసం భర్త ఒత్తిడి చేయడంతో వైఫ్ అంగీకరించలేదు. రోజురోజుకూ భర్త నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేక పోయిన ఆమె, చివరకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 25 ఏళ్ల మహిళ బెంగుళూరు సిటీలోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమార్తె కూడా వుంది.

పెళ్లయిన కొత్తలో బాగానేవున్న ఆమె భర్త, కొద్దిరోజుల నుంచి అసహజ శృంగారానికి బలవంతం చేయడం మొదలుపెట్టాడు. భర్త వికృత చేష్టలని భరించలేక ఆమె, కూతురితో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఐతే, కుమార్తెని చూసేందుకు అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అక్కడ కూడా తన భార్యని ఓవర్ రొమాన్స్ కోసం ఇబ్బందిపెట్టాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన భార్య.. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి, చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. రక్తపు మడుగులోవున్న కూతుర్ని గుర్తించిన పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో భార్య ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Related News