మహేష్‌బాబు ఛాలెంజ్..! మొక్కే కదా అని పీకేస్తారా?

తెలంగాణ సర్కార్ నాలుగో విడత హరిత హారం కార్యక్రమాన్ని సరికొత్తగా ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో వుంది. స్టూడెంట్స్, పోలీస్, కార్పొరెట్స్, సినిమా స్టార్స్.. ఇలా ఏ ఒక్క వర్గాన్నీ ఉపేక్షించకుండా.. అందరి చేతికీ మొక్కలిచ్చి నాటాల్సిందేనంటూ ఒత్తిడి పెడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే ఈ తంతులో భాగంగానే.. ఇగ్నైటింగ్ మైండ్స్ అనే సంస్థ ఒక వినూత్న ప్రచారం షురూ చేసింది. ‘ప్లాంట్ త్రీ ప్లాంట్స్’ పేరుతో ఇప్పటికే ఈ ఛాలెంజ్ బాగా వైరల్ అయ్యింది. తాజాగా.. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. హయత్‌నగర్‌లో మూడు మొక్కలు నాటి ‘నేను సైతం’ అనేశారు. అక్కడితో ఆగకుండా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు మొదటి ఇద్దరు కాగా.. మూడో వ్యక్తి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. సినిమా షూటింగ్ బిజీలో వున్న మహేష్‌బాబు చెవి దాకా ఈ ఊసు చేరిందో లేదో గాని.. సోషల్ మీడియాలో ప్రిన్స్ ఫ్యాన్స్ మాత్రం.. ఈ ‘ఘట్టం’ కోసం తెగ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Related News