వాట్సాప్ యూజర్లకు న్యూరూల్స్ అప్లై

సోషల్‌మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫేక్‌న్యూస్‌పై ఆయా మాధ్యమాల సంస్థలను కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది వాట్సాప్‌. వచ్చేది భారత్‌లో ఎన్నికల సీజన్ కావడంతో వాట్సాప్ సంస్థ అలర్టయ్యింది. భారత్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యంగా వాట్సాప్ దుర్వినియోగం కాకుండా వుండేలా చర్యలు మొదలుపెట్టింది. ఎన్నికల నాటికి గుత్తగా పంపే సందేశాలపై నిఘా ఉంచుతామని ఈసీకి తెలిపింది వాట్సాప్. అలాగే మెక్సికో, బ్రెజిల్‌ ఎన్నికల్లో దుష్ప్రచారాలను నిలువరించిన విధంగా ‘వెరిఫికాడో’ రకం వాట్సాప్‌ మోడల్‌ని భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి ఒకేసారి ఐదుగురికి మాత్రమే సందేశాలను ఫార్వర్డ్‌ చేసేలా నియంత్రించనుంది. ఒకేసారి ఎక్కువమందికి మెసేజ్ పంపేందుకు వీలు కల్పించే క్విక్ ఫార్వర్డ్‌ ఐకాన్‌ను శుక్రవారం నుంచి తొలగిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

READ ALSO

Related News