హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు..కేసీఆర్

పంచాయితీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులమీద సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని తెలంగాణా సీఎం కేసీఆర్ తెలిపారు. పంచాయితీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన.. తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయించిందని, బీసీల రిజర్వేషన్‌కు ఆ పార్టీ గండి కొడుతోందని ఆయన ఆరోపించారు. పంచాయితీ ఎనికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

Related News