రాత్రి నుంచి ధర్నా చేస్తున్న కేజ్రీవాల్‌, మంత్రులు

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసం ఎదుట ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ధర్నా కొనసాగుతోంది. రాత్రి నుంచి కేజ్రీవాల్‌ సహా ముగ్గురు మంత్రులు ఈ ధర్నా చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారుల సమ్మెను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రోత్సహిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. నాలుగు నెలలుగా సమావేశాలకు హాజరుకాకుండా సహాయ నిరాకరణ చేస్తున్న ఐఏఎస్‌ అధికారులు తీరును సమ్మెగా కేజ్రీవాల్ పరిగణిస్తున్నారు. సీఎం, మంత్రుల ధర్నాకు మద్దతుగా లెఫ్టినెంట్ గవర్నర్ నివాసానికి ఆప్ ఎమ్మెల్యేలు, నేతలు చేరుకుని తమ నిరసన తెలియచేస్తున్నారు. తమ ప్రభుత్వంపై మోదీ సర్కారు చేయిస్తున్న అరాచకాల్ని.. వివిధ న్యూస్ పేపర్స్ లో వచ్చిన కథనాల్ని తన ట్విట్టర్ ఖాతాద్వారా రీట్వీట్ చేస్తూ ప్రజలకు తమకు జరుగుతోన్న అన్యాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్.

 

 

 

Related News