వరంగల్ (తూర్పు) టికెట్ ఎవరికి ?

కొండా సురేఖ దంపతులు ఓ వైపు వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగ పడగా.. మరోవైపు ఆశావహులైన మేయర్ నన్నపునేని నరేందర్, గుండు సుధారాణి, బసవరాజు సారయ్య, మెట్టు శ్రీనివాస్, ప్రదీప్ రావు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. (ఈ నియోజకవర్గానికి సంబంధించి తనకు టికెట్ ఖరారు కాకపోవడంతో కొండా సురేఖ పార్టీ అధిష్టానంపై నిప్పులు కక్కిన సంగతి తెలిసిందే).

ఈ పరిణామాల క్రమంలో ఆదివారం రాత్రి మెట్టు శ్రీనివాస్‌తో కలిసి బస్వరాజు సారయ్య, సుధారాణి, వరంగల్‌లోని నరేందర్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశాన్ని ఆత్మీయ సమావేశంగానే పేర్కొన్నారు. ఒక్క ప్రదీప్ రావు మినహా టికెట్‌ను ఆశిస్తున్న ముగ్గురూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు-కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరవచ్చునని వార్తలు వస్తున్న వేళ..వారి వ్యూహం ఇంకా అంతు బట్టడంలేదు.

Related News