కోహ్లి.. అరుదైన రికార్డ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం కోహ్లి నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఈ టూర్‌లో భాగంగా మంగళవారం ఫస్ట్ టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఓ మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 56వ ఇన్నింగ్స్‌లో రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ ఘనతను నలుగురు క్రికెటర్లు మాత్రమే సాధించారు.

ఇప్పటివరకు న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గుప్టిల్‌ 2,271 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కివీస్‌కి చెందిన బ్రెండన్ మెక్కల్లమ్ 2,140 పరుగులతో సెకండ్ ప్లేస్. పాకిస్తాన్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ 2,039 పరుగులతో మూడో స్థానం కాగా, కోహ్లిది నాలుగోవాడు. మరో భారత ఆటగాడు రోహిత్‌‌శర్మ 19 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా గుర్తింపు సాధించనున్నాడు.

Related News