చిరు అల్లుడు ఫిల్మ్ ‘విజేత’ టీజర్

చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా రానున్న మూవీ ‘విజేత’ టీజర్ మంగళవారం రిలీజైంది. దాదాపు ఓ నిమిషం నిడివిగల వీడియో నటుడు మురళీశర్మ వాయిస్‌తో మొదలవుతుంది. కళ్యాణ్ దేవ్ లుక్స్‌తోపాటు ఎక్స్‌ప్రెష‌న్స్ బాగున్నాయి. హీరో తండ్రిగా ముర‌ళీశ‌ర్మ కనిపిస్తున్నాడు. తండ్రి-కొడుకుల మ‌ధ్య సాగే మూవీగా ‘విజేత’ వున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ ఇది.

ఇక హీరోయిన్ విషయానికొస్తే.. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే ఫేం మాళవికానాయర్.. ఈసారి కళ్యాణ్‌తో రొమాన్స్ చేయనుంది. వారాహి బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళభరణి, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాకేశ్ శ‌శి డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఆడియో ఫంక్షన్‌కి చిరంజీవి గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు. ఇక జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ థాట్.

Related News