విజయ్ ‘సర్కార్’లో రెండు కోణాలు

కోలీవుడ్ స్టార్ విజయ్- మురుగదాస్ కాంబోలో రానున్న మూవీ ‘సర్కార్’. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో అమెరికాకు చెందిన టెక్‌ ఎక్జిక్యూటివ్‌గా నటుడు విజయ్‌ కనిపించనున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే విజయ్‌ పాత్ర దాదాపు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు దగ్గరగా ఉంటుందని యూనిట్ చెబుతున్నమాట. చాలాగ్యాప్ తర్వాత యూఎస్ నుంచి చెన్నైకు వస్తాడని, ఆ తర్వాత విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.

ఇటీవలి టాలీవుడ్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను’ ఇంచుమించు ఈ స్టోరీతో వచ్చిందని, ఈ నేపథ్యంలో మురుగదాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. గతంలో విజయ్-మురుగదాస్ కాంబోలో తుపాకి, కత్తి వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. ఇది మూడోది కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి. విజయ్‌ పక్కన హీరోయిన్‌గా కీర్తిసురేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

READ ALSO

Related News