టీచర్ రోల్‌లో త్రిష

విజయ్ సేతుపతి, త్రిష కాంబోలో వస్తోంది ‘96’ అనే చిత్రం. 1996లో తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ తీసినట్టు మేకర్స్ తెలిపారు. ఇది త్రిష 59వ సినిమా అని, ఇందులో ఆమె టీచర్ రోల్‌లో నటిస్తోందని పేర్కొన్నారు.

మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి వహిస్తున్న పాత్ర సరికొత్త తరహాలో ఉంటుందని అంటున్నారు. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కొంతకాలం క్రితమే విడుదల కావలసి ఉన్నా.. కొన్ని కారణాలవల్ల ఆలస్యమైందట. అయితే త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో యూనిట్ ఈ చిత్రం టీజర్ విడుదల చేసింది.

READ ALSO

Related News