త్వరలో..’జగన్’ దేవరకొండ!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. మరో సెన్సేషన్‌కి రెడీ చెప్పేశాడు. ఒకటి స్పైసీ మూవీ.. మరొకటి సాఫ్ట్ ఫిలిం.. రేపు రాబోయే నోటా పొలిటికల్ థ్రిల్లర్.. ఇలా విభిన్నమైన సబ్జక్ట్స్‌తో దూసుకుపోతున్న విజయ్‌ని.. వద్దంటున్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ వచ్చే అవకాశాలు కూడా తనలోని వెర్సటైల్ టాలెంట్‌ని ఎస్టాబ్లిష్ చేసేవే కావడం మరింత ఆసక్తికరం.

మిగతా ప్రాజెక్ట్స్ విషయం అలా ఉంచితే.. ఒక తాజా సంచలనాత్మక చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్‌కి విజయ్ దేవరకొండ సంతకం చేసినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్‌తో వస్తున్న తెలుగు పొలిటికల్ స్టార్ వైఎస్ బయోపిక్ ‘యాత్ర’లో విజయ్ దేవరకొండ దాదాపుగా యాడ్ అయినట్లే! అందులో వైస్ కొడుకు, యువనేత జగన్ వేషం ఎవరు వేస్తున్నారన్న సస్పెన్స్ కొన్నాళ్లుగా నడుస్తోంది. ఆ ఉత్కంఠకు తెర దించుతూ.. మేకర్స్ విజయ్ దేవరకొండను అప్రోచ్ అయ్యారన్నది తాజా వార్త.

‘మహానటి సావిత్రి’ బయోపిక్‌లో కనిపించింది కాసేపే అయినా విజయ్ అప్పియరెన్స్.. ఆ మూవీ మార్కెట్‌కి, క్రేజ్‌కి బాగా ప్లస్ అయ్యింది. ‘యాత్ర’లో కూడా అదే ఎక్స్‌పరిమెంట్‌ని వర్కవుట్ చేయాలన్నది నిర్మాతల స్కెచ్. ‘జగన్’ పాత్రలో విజయ్ దేవరకొండ నటించడం ద్వారా సినిమా మార్కెట్‌తో పాటు.. యూత్‌లో అతడికున్న క్రేజ్ కారణంగా మూవీ మీద పొలిటికల్ అటెన్షన్ కూడా పెరిగే ఛాన్సుంది. దర్శకుడు మహి. వి. రాఘవ్ కూడా ఈ విషయంలో ఏకీభవించాడని.. త్వరలో విజయ్ సెట్స్ మీదకు వెళతాడని తెలుస్తోంది. జగన్ వేషంలో విజయ్ ఫస్ట్‌లుక్ కోసం వైసీపీ క్యాంప్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Related News