‘మహర్షి’కి మరో లక్కీ ఛాన్స్!

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సిల్వర్ జూబ్లీ ఫిలిం ‘మహర్షి’. ఫస్ట్‌లుక్ జోష్ నుంచి ఫ్యాన్స్ ఇంకా తేరుకోలేదు. ఇటీవలే డెహ్రాడూన్ షెడ్యూల్ ముగించుకుని, తర్వాతి షూట్ కోసం అమెరికా వెళ్లనుంది ప్రిన్స్ అండ్ యూనిట్. ఇదిలా ఉంటే.. దిల్ రాజు, అశ్వనిదత్, పీవీపీ కలిసి తీస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి కొత్తకొత్త కమర్షియల్ వ్యాల్యూస్ జతవుతున్నాయి.

పొడగరి జాణ పూజ హెగ్డే రొమాన్స్, అల్లరి నరేష్ కామెడీకి తోడు.. మరో యాడాన్ ఫీచర్ తోడయింది ‘మహర్షి’ మూవీకి. వెటరన్ స్టార్ హీరోయిన్ జయప్రద ‘మహర్షి’ కాస్టింగ్‌లో చేరిపోయింది. ఇందులో జయప్రద.. మహేష్ బాబుకు తల్లిగా నటించనుందట. చాలా కాలం తర్వాత తెలుగు తెర మీద మెరవనున్న జయప్రద అప్పియరెన్స్ ‘మహర్షి’కి మరో కమర్షియల్ బెనిఫిట్ కావొచ్చు. ఈ అందాలరాశి ఎంపిక ద్వారా అటు.. ఉత్తరాది మార్కెట్‌ని సైతం ఎట్రాక్ట్ చేయవచ్చన్నది నిర్మాతల ప్లాన్ !

 

Related News