సంకల్ప్‌రెడ్డి ‘స్పేస్’ ఫిల్మ్ రిలీజ్ డేట్

వరుణ్ తేజ్ – సంకల్ప్‌రెడ్డి కాంబోలో స్పేష్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. సెలైంట్‌గా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి అహం బ్రహ్మస్మి, వ్యోమగామి అనే టైటిళ్లను పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్, రోమన్ ఈ పని చేశారు. స్టంట్స్ కోసం స్పెషల్‌గా సెట్ వేశారు.

టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి సెట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్. అంతరిక్షాన్ని తలపించేలా, గురుత్వాకర్షణ లేని జీరో గ్రావిటీ అది. సెట్స్‌లో వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరిపై 3డి స్కాన్ చేశారు. ఘాజీతో తన టాలెంట్‌ను నిరూపించుకున్న డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి, స్పేస్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్‌తేజ్ పక్కన లావణ్య త్రిపాఠి, అదితిరావ్ హైదరీ హీరోయిన్లు. ఇక రాజీవ్‌రెడ్డి- సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు.

READ ALSO

Related News