సెల్ఫీ సీక్రెట్..!

విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గురించి అప్డేట్ ఇచ్చారు ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం చెప్పిన అనిల్, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లపై ప్రశంసలు కురిపించారు. ”బ్రదర్ లాస్ట్ డే షెడ్యూల్ లో నిన్ను మిస్ అయ్యా”నంటూ వరుణ్ తేజ్ నుద్దేశించి ట్వీట్ చేశాడు అనిల్.

దీనికి రిప్లై ఇచ్చిన వరుణ్ తేజ్, ఫస్ట్ షెడ్యూల్ షూట్ చాలా ఆనందంగా జరిగిందని.. మూవీ యూనిట్ అందరితోనూ మంచిగా ఎంజాయ్ చేశానని, ముఖ్యంగా వెంకటేష్ గారంటూ వరుణ్ తేజ్ రిప్లై ఇచ్చాడు. ఈ సందర్భంగా రెండు ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Related News