ఆకట్టుకోని ‘ఊర్వశి’

రెండున్నర దశాబ్దాల కిందట సౌత్‌లో వచ్చింది ‘ప్రేమికుడు’ ఫిల్మ్. ఇందులో ఊర్వశి ఊర్వశి అనే సాంగ్ వుంది. ఇప్పటికీ దీనికున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఈ క్రమంలో ఈ సాంగ్‌ని హిందీలో రీమిక్స్ చేయడం, దాన్ని విడుదల చేయడం జరిగిపోయింది. ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’ అనే లిరిక్‌ను మాత్రమే తీసుకున్నారు. హీరోయిన్ కైరాఅద్వానీ కారులో క్లబ్‌కి వచ్చింది. ఆమెని ఇంప్రెస్‌ చేయడానికి అక్కడికి వచ్చి డ్యాన్స్‌ చేస్తాడు షాహిద్.

క్లబ్‌లో డ్యాన్స్‌ చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన కొందరు దొంగలు కైరా కారుని కంటెయినర్‌లోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత హీరోయిన్‌కి  తెలీకుండా షాహిద్‌ ఎస్కేప్ అవుతాడు. డ్యాన్స్ చేసిన వ్యక్తి కోసం కైరా వెతుకుతూ క్లబ్‌ బయటికి వచ్చి చూడగా.. షాహిద్‌ తన దొంగల ముఠాతో కలిసి కంటెయినర్‌లోకి ఎక్కి పరారవుతాడు. ప్రొడ్యూసర్ భూషణ్‌ కుమార్‌ ఈ సాంగ్‌ని నిర్మించగా, గిఫ్టీ డైరెక్ట్ చేశాడు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేనట్టే కనిపిస్తోంది.

Related News