సారీ ! చేతులు దులుపుకున్న యూపీ పోలీస్

యూపీలోని హాపూర్ లో గోవధ చేశారన్న వదంతులతో ఇద్దరు వ్యక్తులను పోలీసుల సమక్షంలోనే స్థానికులు కొట్టి వీధుల్లో లాక్కుపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది.

స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఖాసిం అనే వ్యక్తి ఆసుపత్రిలో చనిపోగా.. సమయుద్దీన్ అనే మరో వ్యక్తి గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మొత్తం సంఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీపీ.. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

 

 

మరోవైపు దాడికి పాల్పడిన కొందరు స్థానికులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ సకాలంలో చేరుకోలేకపోయిందన్నది పోలీసుల వర్షన్.

ఏమైనా.. ఖాకీల సమక్షంలోనే లోకల్స్ ఇంత దారుణంగా ప్రవర్తించడం, ప్రేక్షకుల్లా ఉండిపోయిన ఖాకీల చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు గోవధ జరిగిందా లేక ఆ వార్తలు వదంతులేనా అన్న విషయంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.

Related News