చంద్రబాబు కిందకు నీళ్లు తెచ్చిన కేంద్ర మంత్రి!

‘అవిశ్వాసం’ పేరుతో మోదీ సర్కారు మీద యుద్ధం ప్రకటించి.. స్పెషల్ స్టేటస్ కోసం జరిగే పోరాటంలో ముందు నిలవాలన్న చంద్రబాబు ఆశల మీద అడుగడుగునా నీళ్లు జల్లుతోంది ప్రతిపక్ష వైసీపీ. తమ ఎంపీలంతా రాజీనామా చేసిన నేపథ్యంలో లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తాజా ‘అవిశ్వాసం’ ఎపిసోడ్ నుంచి తెలుగుదేశం కూడా లబ్ది పొందకూడదన్న లక్ష్యంతో రాజకీయం చేస్తోంది. ‘స్పెషల్ స్టేటస్ ఫైట్’ని చంద్రబాబు ఎక్కడ హైజాక్ చేస్తారోనన్న ఆందోళన వైసీపీది. ‘మోసకారి చంద్రబాబుతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్’ అంటూ పార్టీ మౌత్‌పీస్ ‘సాక్షి’లో బేనర్ కట్టి ప్రధాన వార్తను ప్రచురించింది. అక్కడితో ఆగకుండా.. సభలో జరిగే ప్రతి వ్యవహారాన్ని తమకు అనువుగా మలుచుకునే ప్రయత్నంలో వుంది వైసీపీ. తాజాగా.. అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ హోమ్ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చేసిన ఒక వ్యాఖ్యను వైసీపీ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది. ‘బాబు ఇప్పటికీ మాకు మిత్రుడే’నన్న సదరు కామెంట్‌ని మంత్రి రాజ్‌నాధ్ సింగ్ యథాలాపంగా చేశారా.. లేక ఉద్దేశపూర్వకంగా చేశారా? అనేది ఆయనకే తెలియాలి.

Related News