రమణదీక్షితులకు షాకిచ్చిన కేంద్రం

టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు కేంద్రం షాకిచ్చింది. వయోపరిమితి నిబంధనలు తీసుకొచ్చి తమను విధుల్లో నుంచి తొలగించారంటూ మే 23న ఆయన చేసిన ఫిర్యాదుని తిరస్కరించింది కేంద్ర న్యాయశాఖ. ఈ అంశం తమ పరిధిలోకి రాదని, ఏదైనా సమస్య ఉంటే రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించింది. కేంద్రం జోక్యంతోనైనా తనకు న్యాయం జరుగుతుందని ఆశించిన రమణ దీక్షితులకు చివరకు భంగపాటు తప్పలేదు.

తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతున్నాయని, విలువైన ఆభరణాలు మాయం అవుతున్నాయని, చివరకు పింక్ డైమండ్‌ను వేలానికి ఉంచారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే! దీంతో సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ పదవీ విరమణ చేసిన అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు సమాచారం.

Related News