లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదుకు సాక్ష్యం..

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు మహిళల ప్రాణాలు తీసింది. హైదరాబాద్ శివారు హయత్ నగర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తోన్న లారీ డ్రైవర్ రోడ్డు దాటుతోన్న ఇద్దరు మహిళల్ని గమనించకుండా వారిపై నుంచి లారీ పోనిచ్చాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు అబ్దుల్లాపూర్‌ బండరావిల గ్రామానికి చెందిన మల్లమ్మ, భారతమ్మగా గుర్తించారు. వీరి వయసు ఒకరిది 45 మరొకరిది 75 ఏళ్లని పోలీసులు తేల్చారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News