తెలంగాణ ఎన్నికల తేదీపై టీ టీడీపీలో ఆందోళన

ఎన్నికల జాబితాలో బోగస్ ఓట్లు… లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న కేసులు హైకోర్టు విచారణలో ఉండగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై టీటీడీపీ పెదవివిరిచింది. భారత ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ ఆపార్టీ తెలంగాణ నేత ఎల్ రమణ వ్యాఖ్యానించారు. నిన్ననే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలలో అడ్డంకులున్నాయని చెప్పి ఇవాళ షెడ్యూల్ ప్రకటించడంలో మర్మమేమిటో అర్థం కావడంలేదని ఆపార్టీ నేతలు వాపోయారు. ఇలాఉండగా, ఆదివారం నుంచి తెలంగాణ యువ సదస్సులు నిర్వహించబోతున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. డిసెంబర్ 7వ తేదీన జరుగబోయే తెలంగాణ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీచేసి బీజేపీ గెలుపొందుతుందని ఆయన అన్నారు.

Related News