బాబు దిశా నిర్దేశం.. కమిటీలకు శ్రీకారం

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పోలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు ఆదివారం భేటీ అయ్యారు. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను ఈ భేటీలో సిద్ధం చేసి..వీటిపై చర్చించారు. బాబు ఆమోదముద్ర వేశాక టీటీడీపీ మూడు కమిటీలను ప్రకటించనుందని పార్టీ నేతలు తెలిపారు.

ఎల్.రమణ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన పొత్తుల సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా  నిర్ణయించారు. ఏమైనా… టీకాంగ్రెస్ తో పొత్తుపై టీటీడీపీ ఓ వ్యూహం ప్రకారం వ్యవహరిస్తోంది.

Related News