రమణ దీక్షితులు, విజయ్‌సాయిలకు టీటీడీ నోటీసులు

పరువుకు భంగం కలిగించారంటూ వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి, టీటీడీ మాజీ అర్చకులు రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ పరువుకు భంగం కలిగించినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించింది.

ఇటీవలకాలంలో శ్రీవారి ఆభరణాలు సీఎం చంద్రబాబు ఇంట్లో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు ఓ అడుగు ముందుకేసి చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో మీడియా సమవేశాలు ఏర్పాటు చేసి మరీ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ బోర్డు, ఆరోపణలు చేస్తున్న వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది.

Related News