అక్బర్‌పై నేనూ పోరాటం చేస్తా..

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ నిరాధారమని, అయినా..ప్రియా రమణి అనే జర్నలిస్ట్ చేసిన ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నానంటూ కేంద్ర మంత్రి, మాజీ జర్నలిస్టు ఎం.జె.అక్బర్ ఆమెపై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రియా రమణి.. దీన్ని తను కూడా దీటుగానే ఎదుర్కొంటానని సవాల్ విసిరింది. నిజం నా ఆయుధం..అది నన్ను కాపాడుతుంది అంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన ఆమె.. అక్బర్..తనమీద ఆరోపణలు చేసినవారిని బెదిరించడం ద్వారా వారి నోరు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని, అయితే నిజం నిలకడమీద తేలుతుందని పేర్కొంది.

మీటూ ఉద్యమ నేపథ్యంలో…నాతో బాటు సుమారు డజను మంది మహిళలు అక్బర్‌పై ఇలా నింద మోపారంటే..వృత్తిగతంగా వారెన్ని ఒత్తిడులకు గురై ఉంటారో, ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారో తెలుస్తోందని ప్రియా రమణి వ్యాఖ్యానించింది. ఇప్పుడైనా బాధితులు బయటకు వచ్చి ధైర్యంగా అక్బర్ వల్ల తాము ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టడం అభినందనీయమని ఆమె అభిప్రాయపడింది.

Related News