మా ఉత్పత్తుల మీద 100% పన్ను వేస్తారా ? ట్రంప్ ఫైర్

సూటిపోటి మాటల ట్రంప్ ఈ సారి  మళ్ళీ ఇండియాను టార్గెట్ చేశారు. తమ దేశ (అమెరికన్) ఉత్పత్తుల దిగుమతిపై ఇండియా 100 శాతం పైగా టారిఫ్ విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. విదేశీ ఉత్పత్తుల దిగుమతులపై కొని దేశాలు అత్యధికంగా టారిఫ్‌లు విదిస్తున్నాయని, ఇందుకు ఉదాహరణ ఇండియానే అని ఆరోపించారు. ‘ నేను చెబుతున్నా.. అసలీ టారిఫ్‌లు ఎందుకు ? వీటిని ఎత్తివేయాలి ‘ అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. వచ్చేవారం భారత్, అమెరికా మధ్య ముఖాముఖి చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ( విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ త్వరలో అమెరికా సందర్శించి అక్కడి ఇవే శాఖల మంత్రులతో చర్చలు జరపనున్నారు).

చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియాలతో బాటు మరికొన్ని దేశాలతో తమ దేశ వాణిజ్య సంబంధాల్లో తులనాత్మకత లేదని, అందుకు ‘ ప్రతీకారం ‘ తోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అన్ని టారిఫ్‌లు, బ్యారియర్లు రద్దు చేయాల్సిందే..నేనిదే విషయాన్ని ఇటీవల కెనడాలో జరిగిన జీ 7 దేశాల సమ్మిట్ లో నొక్కి చెప్పా అని ఆయన తెలిపారు. తన సూచనను ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. తమ దేశానికి చెందిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంలో భారత్ విపరీతంగా పన్ను వేస్తోందని ఆయన ఈ మధ్యే ఫైరయ్యాడు. అవగాహన మేర పరస్పర పన్ను విధానాన్ని అమలు చేయడంలో భారత దేశం పూర్తిగా విఫలమైందని విమర్శించాడు. హార్లీ డేవిడ్‌సన్ తయారీ బైకులపై భారీగా పన్ను వేయడంపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. అమెరికాకు నష్టం కలిగించే దేశాల జాబితాలో చైనాతో బాటు భారత్ కూడా ఉండడం విచారకరమన్నాడు.

Related News