‘ద్రోహులకే తెరాసలో పెద్దపీట’

తెలంగాణా ద్రోహులకు మాత్రమే కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. గత 14 ఏళ్ళుగా టీఆర్ఎస్‌‌‌కు అండగా నిలబడిన తాను ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు.

ఎస్సీలు, మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ మాట తప్పారని, ప్రత్యేక రాష్ట్రంకోసం 1200 మంది ప్రాణ త్యాగం చేస్తే..సుమారు 400 మందిని కూడా ఆదుకోలేదని భూపతి రెడ్డి విమర్శించారు. నాపై అనర్హత వేటు వేసినా సిద్ధంగా ఉన్నా అన్నారు. ‘ ‘కేసీఆర్ తనను తిట్టినవారినే మంత్రివర్గంలో ఉంచుకున్నారు. రైతుబంధు పథకం ఓ విఫలమైన పథకం..కౌలుదారులు తీవ్రంగా నష్టపోయారు’ అని భూపతిరెడ్డి నిప్పులు కక్కారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

Related News