ఎన్నికల హామీలపై ప్రకటన

అధికార టీఆర్ఎస్ రూటు మార్చింది. రాజకీయ నేతల ఆరోపణల కంటే.. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వాటిని చెప్పేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా ఎన్నికల ప్రణాళికలో ఖరారైన కొన్ని కీలక హామీలను మంగళవారం ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల హామీలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అటువైపు ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. పింఛన్ల పెంపు, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థిక చేయూత, వివిధ వర్గాల వారికోసం కొత్త పథకాలు ఉండబోతున్నాయి.

రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంశాలు వుండనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక కోసం గతనెల 6న ఓ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఛైర్మన్‌ కేశవరావుతోపాటు 15 మంది ఇందులో సభ్యులు. మంత్రులు, శాసనసభ్యులు తమ ప్రతిపాదనలు ఈ కమిటీకి సమర్పించారు. దసరా తర్వాత పూర్తిస్థాయి ప్రణాళికను విడుదల చేయించాలని ప్లాన్ చేసినా, ఇప్పటికే కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు హామీలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో అటువైపు గులాబీ బాస్ దృష్టి కేంద్రీకరించారు.

Related News