కొత్త మనోహర్‌కు కోపమొచ్చింది

మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ను తెరాస అధినేత కేసీఆర్ తీగల కృష్ణారెడ్డికి కేటాయించడంతో టీఆర్ఎస్ నేత కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసిన మనోహర్ రెడ్డి ఓడిపోగా, టీడీపీ టికెట్ పై బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే ఆ తరువాత ఆయన టీఆర్ఎస్‌‌లో చేరారు. తాజాగా పార్టీ అధిష్టానం తీగలకే టికెట్ ఇవ్వడంపట్ల మనోహర్ రెడ్డి నిరాశ చెందారు. తన భవిష్యత్తును తీగల నాశనం చేశారని విరుచుకపడ్డారు. జరగబోయే ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మనోహర్ రెడ్డి తెలిపారు.

Related News