పవన్‌తో విభేదాలా? నో అన్న త్రివిక్రమ్

అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తర్వాత పవన్‌కల్యాణ్‌తో విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ వార్తలో ఏమాత్రం నిజంలేదని ఒక్కముక్కలో తేల్చేశాడు. గతంలో ఇద్దరం ఎలాగైతే వుండేవాళ్లమో ఇప్పుడూ అలాగే వున్నామన్నాడు. ఓ తెలుగు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు.

తరచూ తాము ఫోన్లో మాట్లాడుతూనే ఉంటామని, ఈ మధ్యే ఆయనకు ఫోన్‌ చేశానని గుర్తుచేశాడు. ఐనా, సినిమాల వల్ల ఫ్రెండ్‌షిప్ ఎందుకు బ్రేక్ అవుతుంది, అత్తారింటికి దారేది చిత్రం సమయంలో ఎలా వున్నామో, ఇప్పుడు అలానే ఉన్నామన్నాడు. ఐనా, పవన్ ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అస్సలు పట్టించుకోడని ఒక్క ముక్కలో తేల్చేశాడాయన.

READ ALSO

Related News