లైవ్‌లో సుప్రీంకోర్టు లాయర్‌ని కొట్టిన ముస్లింనేత

ట్రిపుల్ తలాక్‌పై ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో రెచ్చిపోయారు ఓ ముస్లిం మతపెద్ద. చర్చ సీరియస్‌గా జరుగుతున్న నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన మతపెద్ద.. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిపై దాడి చేశారు. ఆమె చెంపపై కొట్టారు. దీంతో ఈ షో చూస్తున్న ప్రేక్షకులతోపాటు మిగతావారు అవాక్కయ్యారు. వెంటనే వాళ్లని విడిపించే ప్రయత్నం చేసినా ఆయన కూల్ కాలేదు.. మరిన్నిసార్లు ఆమెపై దాడిచేశాడు.

ఏం జరిగింది?

 

ట్రిపుల్ తలాక్‌పై రెండురోజుల కిందట ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమం చేపట్టింది. ఇందులో మౌలానా ఎజాజ్ అర్షద్ ఖాస్మి.. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరా ఫయాజ్ వంటి వాళ్లు పాల్గొన్నారు. చర్చ జరుగుతుండగా ఎజాజ్- ఫరా మధ్య మాటల వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈ షో లైవ్ టెలికాస్ట్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోయిన ఎజాజ్.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె కూడా ఆర్గ్యుమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య తోపులాట జరగడంతో రెచ్చిపోయిన ఎజాజ్.. మహిళా న్యాయవాదిపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన మిగతాసభ్యులు వాళ్లని విడిపించే ప్రయత్నం చేసిశారు. అయినప్పటికీ మౌలానా వినిపించుకోకపోవడంతో టీవీ ఛానల్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

READ ALSO

Related News