హ్యాపీ బర్త్ డే నాన్నా !

దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి 69 వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయనకు ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్ ఘనంగా నివాళులర్పించారు. తండ్రి వైఎస్సార్ జయంతి రోజే తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2,500 కిలో మీటర్ల అరుదైన మైలురాయిని చేరుకుందని ఆయన తన ట్విటర్ లో పేర్కొన్నారు.

ఇది కేవలం యాదృచ్చికమే గాక, ఏపీ ప్రజలతో బాటు వైఎస్సార్ ఆశీస్సులు కూడా నాకు లభించినట్టు భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా ! ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ‘ అని జగన్ అన్నారు. అటు-వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

 

Related News