మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి..

తెలంగాణాలోని యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం ! వలిగొండ మండలం లక్ష్మాపురం వద్ద మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడగా 16 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందినవారంతా వ్యవసయకూలీలే.. గాయపడినవారిని పోలీసులు, స్థానికులు రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తెలంగాణా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల సాయం,  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో అర్హత గలవారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు.

Related News