కిమ్ వెంట సొంత టాయిలెట్ ఇదే

తన సింగపూర్ టూర్‌ మీద చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. అసలే టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో తన సొంత విషయాలు బయటకు రాకుండా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా తన హెల్త్ విషయంలో మరింత కేర్ తీసుకున్నట్లు అంతర్జాతీయ పత్రికలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో శిఖరాగ్ర చర్చలకు సింగపూర్‌ వచ్చిన కిమ్‌.. తన వెంట సెపరేట్‌గా ఓ మొబైల్‌ టాయ్‌లెట్‌‌ తెచ్చుకున్నారు.

కిమ్‌ కోసం స్పెషల్‌గా దీన్ని డిజైన్ చేయించారు. ప్రస్తుతం కిమ్‌ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన కిమ్‌కు మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లవాతం కూడా ఉన్నాయని, తన మల, మూత్రాదులను పరీక్షించి తన ఆరోగ్య రహస్యాల్ని పసిగట్టేస్తారన్నది ఆయన భయం. ఎలాంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను తయారు చేయించుకున్నారని దక్షిణ కొరియాకి చెందిన ఓ వార్తాపత్రిక రాసుకొచ్చింది.

READ ALSO

Related News