ఆ హీరోయిన్‌పై ఐదేళ్ల బ్యాన్!

అమెరికాలోని చికాగో వేదికగా జరిగిన సెక్స్ రాకెట్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రాకెట్‌లో దక్షిణాదికి చెందిన హీరోయిన్లు వున్నట్లు తెలుస్తోంది. కొందరు డబ్బు కోసమైతే, మరికొందరు బలవంతంగా ఈ రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ వ్యహారంలో బాధితురాలుగావున్న బెంగుళూరుకి చెందిన  ఓ హీరోయిన్‌పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం. గతేడాది డిసెంబరులో ఆ హీరోయిన్‌ వీసాపై ఐదేళ్ల పాటు ట్రావెల్ బ్యాన్ విధించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం తెలియని సదరు నటి.. మార్చిలో అమెరికా వెళ్లింది.

ఆమెని అధికారులు అనుమతించకపోవడంతో ఆ రోజు ఎయిర్‌పోర్టులో బస చేసి తిరిగి బెంగుళూరుకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా తన లాయర్‌తో కలిసి అమెరికా అధికారుల ముందు హాజరైన బాధిత హీరోయిన్,  తనపై ట్రావెల్ బ్యాన్ ఎత్తి వేయాలని అధికారులను కోరింది. ఈ విషయంలో ఆమె రిక్వెస్ట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బ్యాన్ ఎత్తివేసే అధికారం తమకు లేదని అధికారులు అన్నట్లు తెలుస్తోంది. ఐతే, పేరు బయటపెట్టమని అధికారులు హామీ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అనేదానిపై సోషల్‌మీడియాలో రచ్చరచ్చ అవుతోంది.

Related News