టాలీవుడ్ నటుడు వినోద్ హఠాన్మరణం

టాలీవుడ్ నటుడు వినోద్ రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో హఠాన్మరణం చెందారు. తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటులైన వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి తదితర సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన 300కుపైగా సినిమాల్లో నటించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో ఆయన విలన్‌గా మెప్పించారు. రాత్రి రెండు గంటల సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. బుల్లితెర ప్రేక్షకులకు కూడా వినోద్ సుపరిచితులు. వినోద్ మృతికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, నటీనటులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Related News