టాలీవుడ్ రెడ్ స్టార్ మాదాల రంగారావు ఇక లేరు

నటుడు, నిర్మాత మాదాల రంగారావు శనివారం ఉదయం మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు. కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయన, ఈ ఉదయం ఐదుగంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. విప్లవ భావాలతో కూడిన సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. చైర్మన్ చలమయ్య అనే మూవీతో గ్లామర్ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన మాదాల రంగారావు, లవ్ స్టోరీ సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో విప్లవాత్మక చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు.

ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, జనం మనం, ప్రజాశక్తి వంటి చిత్రాల్లో నటించిన రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘యువతరం కదిలింది’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బంగారు నంది అవార్డుని సొంతం చేసుకున్నారు. మాదాల రంగారావు సొంతూరు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు. ప్రజానాట్య మండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు కూడా!

Related News