షాకింగ్.. సెకన్లలో యాపిల్ స్టోర్‌ చోరీ

అమెరికాలో ఓ యాపిల్ స్టోర్‌లోకి చొరబడిన దొంగలు.. సెకన్ల వ్యవధిలో 27వేల డాలర్ల విలువ చేసే వస్తువులను దోచుకుపోయారు. ఈ తతంగమంతా సెకన్లలో జరిగిపోయింది. లొకేషన్, ఎప్పుడు, అన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. ఈనెల 7న కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో  ఫ్యాషన్ ఫెయిర్ మాల్‌లోని యాపిల్ స్టోర్‌లోకి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. వాళ్లంతా ముఖాలు కనిపించకుండా హుడ్స్‌తో కూడిన జాకెట్లను వేసుకున్నారు. స్టోర్‌లోకి వేగంగా వచ్చి తమకు దొరికిన యాపిల్ ప్రొడక్ట్స్‌ను జాకెట్లలో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.

కేవలం 30 సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. స్టోర్‌లో ఏం జరిగిందో సిబ్బందికే కాకుండా కస్టమర్స్‌కు అర్థంకాలేదు. మెల్లగా తేరుకున్నాక చోరీ అని తేలడంతో నివ్వెరపోయారు. దొంగలించిన యాపిల్ ప్రొడక్ట్స్(మాక్‌బుక్‌లు, ఐఫోన్ 6, 7, 8, ఐఫోన్ X లు) మొత్తం విలువ 27వేల డాలర్లు అంటే సుమారుగా రూ.18.57 లక్షలన్నమాట. చోరీకి వచ్చింది ఐదుగురు వ్యక్తులని, వాళ్ల వయస్సు 16 – 18 ఏళ్ల లోపే వుంటుందని పోలీసులు చెబుతున్నారు. స్టోర్‌లోవున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారాయి.

READ ALSO

Related News