విజయవాడలో దారుణం, మహిళ గొంతు కోసి

విజయవాడ దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి పద్మ అనే మహిళపై దాడి చేసి, ఆపై కత్తితో గొంతు కోశారు. ఆ తర్వాత ఇంట్లోవున్న నగలు, బంగారం దోచుకెళ్లారు. సేల్స్ రిప్రజెంటేటివ్ పేరుతో ఇంట్లోకి అడుగుపెట్టిన దుండగులు, దొంగతనానికి ప్రయత్నించగా, పద్మ అనే మహిళ అడ్డుకుంది. దీంతో ఆమె మెడపై కత్తితో దాడి చేసి, బెడ్రూంలో పడేశారు. రక్తపు మడుగులోవున్న మహిళ ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సీసీఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. నాలుగురోజుల కిందట దుండగులు ఇక్కడ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

READ ALSO

Related News