అత్తాకోడల్ని నిర్బంధించి రూ.కోటి, నగలు దోపిడీ.. దొరికేసిన దొంగలు

గుంటూరుజిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో భారీ దోపిడీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీభత్సం సృష్టించారు. అత్త, కోడలును నిర్బంధించి..కోటి రూపాయలు, 160 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చినట్టు నిర్ధారణ అయింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఏపీ రాజధాని ప్రాంతమైన పెనుమాక గ్రామంలో పట్ట పగలే సినీ పక్కీలో జరిగిన ఈ చోరీ సంచలనం రేపింది. పెనుమాక గ్రామానికి చెందిన మేకా వేమారెడ్డి, అతని కుమారుడు మేకా బ్రహ్మారెడ్డి ఇంట్లో లేని సమయంలో చోరీ కి పాల్పడ్డారు దుండగులు. వేమారెడ్డి భార్య కమల, కోడలు పార్వతిని తాళ్లతో నిర్బంధించి బీరువా తాళాలు తీసుకున్న దుండగలు.. నగదు, నగలను దోచుకుపోయారు. బీరువాలోని మరో బ్యాగులో ఉన్న రూ.68లక్షల నగదును దుండగులు గుర్తించపోవడంతో వదిలేసి పోయారు.

కమల తల్లి గొర్ల రాములమ్మకు చెందిన ఎకరం 15 సెంట్ల భూమిని ఏడునెలల కిందట రూ.3 కోట్లకు విక్రయించారు. ఈ సొమ్ముతో కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని దేవరపల్లి వద్ద 3.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు సొమ్ము ఇంట్లో పెట్టుకున్నారు. గురువారం వేమారెడ్డి, బ్రహ్మారెడ్డి దేవరపల్లి వెళ్లారు. వారు వెళ్లిన అరగంటకే చోరీ జరిగింది. వేమారెడ్డి ఫ్యామిలీ గురించి తెలుసున్నవాళ్లే ఈ పనికి పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. దోపిడీకి పాల్పడ్డ దొంగల్ని అదుపులోకి తీసుకుని వాళ్లనుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకుని దుండగుల్ని అరెస్ట్ చేశారు.

Related News