ఆమె థ్యాంక్స్ చెప్పింది

కేరళ వరదలకు విలవిలలాడిన టౌన్లలో అలూవా ఒకటి. ఈ పట్టణంలోని చెంగమనాడ్ ప్రాంతంలో ఈ నెల 17‌న సాజితా జాబిల్ అనే గర్భిణిని నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా రక్షించారు. ఓ డాక్టర్‌ను అదే హెలికాప్టర్ ద్వారా ఆమె ఉంటున్న ఇంటిపై కప్పు మీదకు దింపి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన ఓకే చెప్పగానే ఆమెను రోప్ ద్వారా పైకి లాగి రక్షించారు.

సాజితాను వెంటనే కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా..అక్కడ ఆమెకు అరగంటలోనే పండంటి మగ బిడ్డ పుట్టాడు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. తాజాగా సాజితా నివసించిన ఇంటి పై కప్పు (డాబా) మీద ‘ థ్యాంక్స్ ‘ అన్న పదం పెయింట్ చేసి ఉండడం చూసి నేవీ సిబ్బంది ఆశ్చర్యపోయారు.  అటు-ఆసుపత్రిలో తల్లీబిడ్డలు ఫైన్‌గా ఉండడమే గాక.. ఈ రకంగా  ధన్యవాదాలు చెప్పడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని నాడు హెలికాప్టర్ నడిపిన నేవీ పైలట్ కమోడోర్ విజయ్ వర్మ అంటున్నారు.

Related News