శబరిమలలో అదే ఉద్రిక్తత

శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద గురువారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించగా.. 24 గంటల బంద్ కు విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్ సంస్థలు పిలుపునిచ్చాయి. మహిళలను ఆందోళనకారులు అడ్డుకుంటూనే ఉన్నారు. బస్సుల్లో నుంచి … 10- 50 ఏళ్ళ లోపు వయస్సు గల మహిళలను దించివేస్తున్నారు. బుధవారం న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌ సుహాసిని రాజ్‌ సహా ఓ మీడియా సంస్థకు చెందిన మహిళా జర్నలిస్టులను నిరసనకారులు అడ్డుకుని వారి వాహనాన్ని తిప్పిపంపిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసినా..ఉద్రిక్తత చల్లారలేదు. దాదాపు అదే యుద్ధ వాతావరణం గురువారం కూడా నెలకొంది.

Related News