తెలంగాణలో సీఎం ఎవరు? సర్వేలో తేలిన నిజాలేంటి?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగేశాయి. కేసీఆర్.. వచ్చేవారం నుంచి ప్రచారం మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం మొదలుపెట్టింది బీజేపీ. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. పొత్తులపై అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ రావడంతో రేపోమాపో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీంతో ఎన్నికలు సందడి మొదలైంది. తాజాగా ఇండియా టుడే.. పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో తెలంగాణలో సర్వే చేపట్టింది. అత్యధిక తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే మద్దతు పలికారు. కేసీఆర్ పనితీరుపై 48 శాతం మంది బాగుందని చెప్పగా, 26 శాతం మంది సంతృప్తికరంగా లేదన్నారు. మరో 16శాతం మంది యావరేజ్‌గా వుందన్నారు.

సీఎంగా మళ్లీ కేసీఆర్‌ రావాలని 43శాతం మంది కోరుకుంటున్నట్లు తేలింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సీఎంగా చూడాలనుకునే వారి శాతం 18 కాగా, బీజేపీ నేత కిషన్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నవాళ్లు 15శాతం. ‘ఇండియాటుడే – మైయాక్సిస్’ పోల్ తెలంగాణలోని ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఫోన్ ద్వారా ప్రతి నియోజకవర్గం నుంచి 7,110 శాంపిల్స్‌ను తీసుకుని సర్వే చేసింది. ఇక పరిశుభ్రత బాగుందని ఎక్కువగా చెప్పడం విశేషం. నిరుద్యోగం, వ్యవసాయం, ధరల పెరుగుదలపై చాలామంది అసంతృప్తి వ్యక్తంచేయడం గమనార్హం.

Related News