తెలంగాణలో రాష్ర్టపతి పాలన విధించాల్సిందే

ఆపధర్మ సీఎంగావున్న కేసీఆర్‌ను తొలగించి తెలంగాణలో రాష్ర్టపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి రాజకీయ పార్టీలు. రాజ్యాంగ సంస్థలను నియంత్రిస్తూ కేసీఆర్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించాయి. కక్ష సాధింపు ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నారని కోరుతూ గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల నేతలు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని చేసిన వ్యాఖ్యలపైనా నేతలు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తాము ఫిర్యాదు చేయగా గవర్నర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదని, త్వరలో రాష్ట్రపతిని కలుస్తామన్నారు. ఒకవేళ కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగితే రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని విమర్శించారు. ఈ అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Related News