ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన హరీష్ రావు

ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు కేవలం 4ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి మంత్రి హరీష్ రావు. యావత్ తెలంగాణకే గర్వకారణమైన పనులు చేస్తున్నారని సంతోషపడటంమాని కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని ఢిల్లీలో హైవేల మంత్రి నితిన్ గడ్కరీని కోరిన హరీష్ రావు.. రాష్ట్రంలో జాతీయ రహదారుల పరిపూర్తికి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సహకరించండని కోరారు. బకాయిల విడుదలకు గడ్కరీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు భేటీ వివరాలు తెలియచేశారు. హరీష్ రావుతోపాటు కేంద్రమంత్రిని కలిసినవారిలో ఎంపీలు వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్నారు.

Related News